రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

రౌడీ షీటర్లకు కడప పోలీసుల కౌన్సిలింగ్‌

వై.ఎస్.ఆర్ కడప జిల్లాలో నేర నియంత్రణ కోసం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలపై రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు పోలీసు స్టేషన్లలో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో మళ్లీ పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

శాంతిభద్రతల కోసం అవగాహన, పర్యవేక్షణ, గస్తీ చర్యలను కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. రౌడీ షీటర్లకు కడప పోలీసుల కౌన్సిలింగ్‌ వై.ఎస్.ఆర్ కడప జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ విస్తృత చర్యలు చేపట్టింది.

జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులు, చెడు నడత కలిగిన వారిని స్టేషన్లకు పిలిపించి పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →