రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప శిల్పారామంలో స్థానిక చేతివృత్తులు, హ్యాండ్‌లూమ్, చెక్క బొమ్మలు, ఆర్ట్ బొమ్మలు, హ్యాండ్‌మేడ్ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయానికి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టాల్స్‌కు దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 25వ తేదీ చివరి గడువుగా నిర్ణయించగా, స్టాల్స్ కేటాయింపు, అద్దె, ప్రదర్శన కాలం వంటి వివరాల కోసం శిల్పారామం కార్యాలయం లేదా 88866 52058, 88866 52038 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించార
కడప శిల్పారామంలో చేతివృత్తుల స్టాల్స్‌కు అవకాశం కడప నగరంలోని శిల్పారామంలో చేతివృత్తులు, హ్యాండ్‌లూమ్, చెక్క బొమ్మలు, ఆర్ట్ బొమ్మలు తదితర ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేందుకు కళాకారులకు అవకాశం కల్పిస్తున్నారు. స్థానికంగా తయారయ్యే హస్తకళా, హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో శిల్పారామం ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
చేతివృత్తుల కళాకారులు, హ్యాండ్‌లూమ్ రంగంలో పనిచేసే వారు, చెక్క బొమ్మలు తయారు చేసే శిల్పులు, వివిధ రకాల ఆర్ట్, హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులు తయారు చేసే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు పరిచయం చేసుకునే వేదికగా ఈ స్టాల్స్ ఉపయోగపడనున్నాయని పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి