రాయలసీమ న్యూస్ ఎడ్యుకేషన్ డెస్క్
కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 4 సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తులు సమర్పించి, అవసరమైన సర్టిఫికెట్లతో ఆగస్టు 5 ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.
కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో నేడు స్పాట్ అడ్మిషన్లు కడపలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 5వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. కళాశాలలోని సివిల్, కంప్యూటర్, ఈసీఈ, ఈఈఈ బ్రాంచుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా కాలేజీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని ప్రిన్సిపాల్ వివరించారు. పాలిసెట్-2026 పరీక్ష రాసిన అభ్యర్థులతో పాటు పదోతరగతి ఉత్తీర్ణులైన వారు కూడా ఈ స్పాట్ అడ్మిషన్లకు అర్హులని ఆమె స్పష్టం చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి