రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
కదిరి లక్ష్మీ నరసింహ స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా ఆగష్టు 19న ఉదయం 6 గంటలకు స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అభివృద్ధి పనుల కారణంగా ప్రారంభ స్థలంలో మార్పులు చేసి, భక్తుల కోసం మార్గమంతా సౌకర్యాలు, మహా ప్రసాద వితరణ, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ స్టీల్ ప్లేట్ల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. కదిరి లో 19న స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ కదిరి లక్ష్మీ నరసింహ స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా ఆగష్టు 19న స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఉదయం 6 గంటల నుంచి గిరిప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభం కానుంది. స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ గిరిప్రదక్షిణకు ప్రాంతీయ భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి