రాయలసీమ న్యూస్ - చిత్తూరు
చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. ఆస్థాన మండపంలో జరిగిన వ్రతంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు, రథోత్సవంలో భాగస్వాములయ్యారు.
వ్రతం, బంగారు రథోత్సవం విజయవంతంగా ముగియడంతో ఆలయ పరిసరాలు భక్తుల నామస్మరణతో మాంగల్య వాతావరణాన్ని సంతరించుకున్నాయి. కాణిపాకం ఆలయంలో వైభవంగా సంకటహర చతుర్థి వ్రతం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని ప్రసిద్ధ కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు.
ఆస్థాన మండపంలో జరిగిన వ్రతంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృప కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు సిద్ధి, బుద్ధి సమేత మైన వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి