రాయలసీమ న్యూస్ - కర్నూలు
కర్నూలు జిల్లా కోడుమూరు వాసవి కల్యాణమందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ నిర్వహించిన జిల్లా స్థాయి మెగా కిసాన్ మేళాలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతికత, పంటల నిర్వహణపై నిపుణులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, రైతుల ఆదాయం పెంపు దిశగా పలు చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
కోడుమూరు లో మెగా కిసాన్ మేళా – రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు కర్నూలు జిల్లా కోడుమూరు టౌన్ వాసవి కల్యాణమందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ (ATMA) నిర్వహించిన జిల్లా స్థాయి మెగా కిసాన్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు.
రైతులకు అవగాహన పెంపు, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ప్రాచుర్యం లక్ష్యంగా ఈ మేళాను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి