రాయలసీమ న్యూస్ - నంద్యాల
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్ ఫ్యాక్టరీలో సోమవారం మద్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించి యంత్రాలు, ముడి సరుకు సహా సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని కార్మికులు చెబుతుండగా, ఫ్యాక్టరీకి అవసరమైన అనుమతులు లేవని స్థానికులు ఆరోపిస్తూ, సంబంధిత శాఖలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో పాలిమర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్ ఫ్యాక్టరీలో సోమవారం మద్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో పలువురు కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి