రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు మండలం లింగాపురం PACS ఆధ్వర్యంలో యూరియా, DAPతో పాటు రాయితీ ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. DBT, APAIMS 2.0 విధానాల ద్వారా పారదర్శకంగా ఎరువులు అందించడంతో పాటు ఎల్ నినో ప్రభావ నివారణపై రైతుల అవగాహన కోసం ప్రత్యేక కరపత్రాలను విడుదల చేసి, మండలంలోని రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తో ఎరువుల పంపిణీ ప్రారంభం ప్రొద్దుటూరు మండలం లింగాపురం PACS ఆధ్వర్యంలో యూరియా, DAPతో పాటు రాయితీతో కూడిన ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని రైతులకు అవసరమైన ఎరువులను సమయానికి అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
లింగాపురం PACS ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) మరియు APAIMS 2.0 విధానాల అమలుతో ఎరువుల పంపిణీ జరగనుంది. ఈ విధానాల ద్వారా రైతులకు ఎరువులు పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి