రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కొత్త ఓటర్ల జాబితా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి: అంజాద్ బాషా

మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యి కొత్త ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కడప నియోజకవర్గంలో భారీగా ఓట్లు తొలగింపులు, నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, ప్రస్తుత జాబితాతో ఎన్నికలు జరిపితే భవిష్యత్‌లో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యంపై నమ్మకం నిలవాలంటే ఖచ్చితమైన ఓటర్ల జాబితా, పారదర్శక ఎన్నికల నిర్వహణ అవసరమని ఆయన పేర్కొన్నారు. కొత్త ఓటర్ల జాబితా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి: అంజాద్ బాషా కడప: స్థానిక సంస్థల ఎన్నికలను కొత్తగా విడుదలయ్యే ఓటర్ల జాబితా ఆధారంగానే నిర్వహించాలని మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా డిమాండ్ చేశారు.

కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుత పరిస్థితుల్లో సరైన ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలు నిర్వహించడం వల్ల భవిష్యత్‌లో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కడపలో గతంలో ఓటర్ల సంఖ్య 2.87 లక్షలుగా ఉండగా, SIR ప్రక్రియ తర్వాత అది 2.17 లక్షలకు తగ్గిపోయిందని అంజాద్ బాషా తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →