రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి

మడకశిరలో ఎమ్మెల్యే మొబైల్ హెల్ప్‌లైన్ సేవలు ప్రారంభం

మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు క్యాంపు కార్యాలయంలో మొబైల్ హెల్ప్‌లైన్ సేవలను ప్రారంభించి, నియోజకవర్గ ప్రజల సమస్యలు, అభ్యర్థనలు, అత్యవసర అవసరాలను నేరుగా స్వీకరించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులను వర్గీకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి నిర్దిష్ట కాలపట్టికలో పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించామని నిర్వాహకులు తెలిపారు.

మడకశిరలో ఎమ్మెల్యే మొబైల్ హెల్ప్‌లైన్ సేవలు ప్రారంభం మడకశిర: మడకశిర నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొబైల్ హెల్ప్‌లైన్ సేవలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ శాసనమండలి సభ్యులు గుండుమల తిప్పేస్వామి కలిసి ఈ నూతన సేవలకు శ్రీకారం చుట్టారు.

ఈ మొబైల్ హెల్ప్‌లైన్ ద్వారా నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు, ప్రజా అవసరాలను నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి తెలియజేసే అవకాశం కలిగింది. ప్రజల నుంచి హెల్ప్‌లైన్ ద్వారా అందిన ఫిర్యాదులు, వినతులను వెంటనే పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →