రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

మదనపల్లెలో ఇద్దరు విద్యార్థుల మధ్య కత్తులతో దాడులు

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు కత్తులతో పరస్పరం దాడి చేసుకుని గాయపడిన ఘటన సోమవారం రాత్రి సంచలనం రేపింది. మడికయళ్ల ప్రాంతంలో సరదాగా వెళ్లిన సమయంలో వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో కత్తులతో దాడి చేసుకున్న ఇద్దరిని జిల్లా ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

కేసు నమోదు చేసిన పోలీసులు గొడవకు కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మదనపల్లె లో ఇద్దరు విద్యార్థుల మధ్య కత్తులతో దాడులు అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ఇద్దరు విద్యార్థులు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్న ఘటన సోమవారం రాత్రి సంచలనం రేపింది.

మదనపల్లె తాలూకా పరిధిలో జరిగిన ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం, బొంబు బజారులో నివాసం ఉంటున్న అమీర్ బాష కుమారుడు ఆఫ్సాన్ (20), తాళ్ల సుబ్బన్న కాలనీలో నివాసం ఉంటున్న షమీవుల్లా కుమారుడు సాదిక్ (22) ఇద్దరూ మదనపల్లెలోని మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న విశ్వహిత డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →