రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలం మాధవరం గ్రామంలో NRGS నిధులతో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన 400 మీటర్ల సీసీ రహదారిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ రహదారి వల్ల గ్రామ ప్రజలు, రైతులు, విద్యార్థుల రాకపోకలు సులభతరం కానున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు తెలిపారు.
మాధవరం గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు ప్రారంభం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రాయచోటి రూరల్ మండలం మాధవరం గ్రామంలో రూ.20 లక్షల NRGS నిధులతో నిర్మించిన 400 మీటర్ల సీసీ రోడ్డు గురువారం ప్రారంభమైంది. మాధవరం గ్రామంలో RKT నుంచి కంచరపల్లె వరకు నిర్మించిన ఈ నూతన రహదారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.
గ్రామ ప్రజల చిరకాల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టినట్లు మంత్రివర్యులు కార్యక్రమంలో తెలిపారు. నూతన సీసీ రహదారి అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని ఆయన పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి