రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా మైదుకూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో శాకంబరీ దేవి అలంకార మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కూరగాయలు, పండ్లతో చేసిన ప్రత్యేక శాకంబరీ అలంకరణను దర్శించుకోవడానికి మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ప్రార్థనలు చేశారు.
వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, మహా మంగళహారతి, తీర్థ ప్రసాదం, భోజన ప్రసాదం నిర్వహించగా ప్రతి ఏడాది ఈ మహోత్సవానికి మైదుకూరు, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మైదుకూరులో శాకంబరీ దేవి అలంకార మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహణ కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో శాకంబరీ దేవి అలంకార మహోత్సవం గురువారం భక
ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక అలంకరణలతో దేవస్థానం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి