రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 7 రోడ్లు సర్కిల్ సమీపంలోని భాస్కర్ వైన్ షాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేగింది. గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో మృతుడి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నివేదిక, సీసీ కెమెరా దృశ్యాలు, స్థానికుల సమాచారంపై ఆధారపడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కడప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కడప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 7 రోడ్లు సర్కిల్ సమీపంలో ఉన్న భాస్కర్ వైన్ షాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికులు వైన్ షాప్ వద్ద వ్యక్తి మృతదేహాన్ని గమనించి వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి