రాయలసీమ న్యూస్ - అనంతపురం
అనంతపురం మార్కెట్ యార్డ్ పరిధిలో కొంతమంది మండి దళారులు కాటా వద్ద రైతులను ప్రలోభపెట్టి చివరికి మోసం చేస్తున్నారన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. రైతులు తమకు నచ్చిన మండిని స్వేచ్ఛగా ఎంచుకునే హక్కు ఉందని, దళారుల అక్రమ ప్రవర్తనను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్ బల్లా పల్లవి స్పష్టం చేశారు.
రోజువారీ మైక్ ప్రకటనల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. రైతులను మోసం చేస్తున్న మండి దళారులు:మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి అనంతపురం మార్కెట్ యార్డ్ పరిధిలో కొంతమంది మండి దళారులు రైతులను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వరుసగా వెలువడుతున్నాయి.
కాటా వద్ద నిలబడి, తమ మండికి రావాలని ప్రలోభపెట్టి, ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి చివరికి రైతులను మోసం చేస్తున్నారని బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు మార్కెట్ యార్డ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు రైతులు చెబుతున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి