రాయలసీమ న్యూస్ - నంద్యాల

నందికొట్కూరులో వివాహిత ఉరేసుకుని మృతి

నందికొట్కూరు వాల్మీకి నగర్‌లో 20 ఏళ్ల యువ వివాహిత రమాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతి చెందింది. తరచూ దంపతుల మధ్య కలహాలు జరుగుతున్నాయన్న సమాచారం నేపథ్యంలో, రమాదేవి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా నందికొట్కూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, సీఐ అశోక్‌కుమార్ పర్యవేక్షణలో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నందికొట్కూరులో వివాహిత ఉరేసుకుని మృతి నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని వాల్మీకి నగర్‌లో యువ వివాహిత బలన్మరణం చోటుచేసుకుంది. స్థానికంగా లభించిన వివరాల ప్రకారం, బోయ శివకుమార్ భార్య రమాదేవి (ప్రియ) (20) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ మండలం కొన్నేరు గ్రామానికి చెందిన శివకుమార్‌తో రమాదేవి రెండున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహానంతరం దంపతులు నందికొట్కూరు పట్టణంలోని వాల్మీకి నగర్‌లో నివాసముంటున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →