రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
మదనపల్లి పిఎన్‌టి కాలనీలో రిటైర్డ్ ఆర్‌డబ్ల్యూఎస్‌టీ అధికారి రవీంద్ర ఇంట్లోకి ముసుగు దొంగలు చొరబడి 400 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, రూ.25 వేల నగదు అపహరించారు. సమాచారం అందుకున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేసి సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు.
మదనపల్లిలో ముసుగు దొంగల హల్‌చల్ మదనపల్లి పట్టణంలోని పిఎన్‌టి కాలనీలో ముసుగు దొంగలు హల్‌చల్ చేశారు. రిటైర్డ్ ఆర్‌డబ్ల్యూఎస్‌టీ అధికారి రవీంద్ర ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు.
ఈ ఘటనతో కాలనీలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితుల సమాచారం ప్రకారం, ఇంటి కిటికీ చువ్వలను తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువాను తెరిచి వస్తువులను చిందరవందర చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి