రాయలసీమ న్యూస్ - అనంతపురం
అనంతపురం జిల్లా గుత్తి టౌన్ చెర్లోపల్లి కాలనీలో మట్కా రాస్తున్న షేక్ అన్వర్ భాషాను పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేసి, రూ.22,350 నగదు, మట్కా చీటీలు, బాల్ పెన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, మట్కా, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతూ, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గుత్తి టౌన్‌లో మట్కా రాస్తున్న వ్యక్తి అరెస్ట్ అనంతపురం జిల్లా గుత్తి టౌన్‌లో మట్కా రాస్తున్న వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. గుత్తి CI రామారావు ఆధ్వర్యంలో టౌన్ పోలీసు బృందం మెరుపు దాడి నిర్వహించి నిందితుడిని పట్టుకుని, అతని వద్ద నుండి నగదు, మట్కా చీటీలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, 14-08-2026 ఉదయం 11:30 గంటల సమయంలో CI రామారావు సూచనల మేరకు SI సురేష్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది గుత్తి టౌన్ చెర్లోపల్లి కాలనీలోని బ్రహ్మయ్య గుడి వద్ద దాడి నిర్వహించారు. ఈ దాడిలో షేక్ అన్వర్ భాషా (54 సంవత్సరాలు), S/O లేట్ అబూ తాలిం, కులం ముస్లిం, D.No.10/685, చెర్లోపల్లి కాలనీ, గుత్తి టౌన్ నివాసిని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి