రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయ నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలను ఖండిస్తూ అభ్యర్థులు ‘ఛలో కర్నూల్ మెగా డీఎస్సీ–2025 ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి 42 మంది అభ్యర్థులు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జరిగే ర్యాలీలో పాల్గొంటున్నారు.
ఉపాధ్యాయుల ఐక్యత, న్యాయమైన నియామకాలకు మద్దతు ప్రకటిస్తూ, నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వడం ఈ ర్యాలీ లక్ష్యంగా ఉంది. మెగా డీఎస్సీ–2025 తప్పుడు ప్రచారాన్ని చెక్: ఆత్మగౌరవ ర్యాలీ సిద్ధం మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయ నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలను ఖండిస్తూ అభ్యర్థులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఉపాధ్యాయుల ఐక్యతకు, న్యాయమైన నియామకాలకు మద్దతుగా ఈ ర్యాలీని చేపట్టాలని నిర్ణయించారు. మెగా డీఎస్సీ–2025 ద్వారా వేలాది మంది అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కల్పించిన ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించేందుకు ఈ ఆత్మగౌరవ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి