రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి చెందిన బత్తాయి రైతు వెంకటసుబ్బయ్య తన తోటలో మైక్రో స్ప్రింక్లర్లను ప్రయోగాత్మకంగా అమలు చేసి తెగుళ్ల నియంత్రణలో విజయవంతమయ్యారు. ప్రతి చెట్టుకు ఒక్కో స్ప్రింక్లర్ ఏర్పాటు చేసి పదిరోజులకు ఒకసారి తుంపర్ల రూపంలో నీరు చల్లడంతో పురుగులు తగ్గి దిగుబడి పెరగడంతో పాటు పురుగుమందుల వినియోగం కూడా తగ్గిందని రైతులు చెబుతున్నారు.
కడప లో బత్తాయి తోటల్లో మైక్రో స్ప్రింక్లర్ల ప్రయోగం విజయవంతం కడప జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో బత్తాయి రైతులు తెగుళ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. బత్తాయి చెట్లకు తరచుగా మందులు పిచికారీ చేసినా పురుగులు, తెగుళ్లు పూర్తిగా తగ్గకపోవడంతో దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదని రైతులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పట్లకు చెందిన రైతు వెంకటసుబ్బయ్య తన తోటలో కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. సుమారు ఏడాది క్రితం వెంకటసుబ్బయ్య తన బత్తాయి తోటలోని 20 చెట్లకు మైక్రో స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి పరీక్షించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి