రాయలసీమ న్యూస్ - కర్నూలు
సోమవారం అశోక్ నగర్ నీటి శుద్ధి కేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా నగరమంతా తాగునీటి సరఫరా రోజంతా నిలిచిపోనుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. యంత్రాల సామర్థ్య పరీక్షలు, మరమ్మతులు, భాగాల మార్పు వంటి పనులు చేయాల్సి ఉండడంతో ఈ అంతరాయం తప్పదని చెప్పారు.
ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకుని, పనులు పూర్తయ్యే వరకు సహనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. సోమవారం నగరమంతా తాగునీటి సరఫరాకు అంతరాయం నగరంలోని అశోక్ నగర్‌లో ఉన్న నీటి శుద్ధి కేంద్రంలో నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉండడంతో సోమవారం నగర వ్యాప్తంగా తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో కమిషనర్ చల్లా ఓబులేసు, తొలుత కొన్ని కాలనీల్లో మాత్రమే తాగునీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని భావించినప్పటికీ, నీటి శుద్ధి కేంద్రంలోని అన్ని యంత్రాల సామర్థ్యాన్ని తనిఖీ చేసి, అవసరమైన నిర్వహణ పనులు చేయాల్సి రావడంతో నగరమంతా నీటి సరఫరా నిలిచిపోనుందని స్పష్టం చేశారు. అశోక్ నగర్ నీటి శుద్ధి కేంద్రం ద్వారా నగరంలోని ప్రధాన ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి