రాయలసీమ న్యూస్ - చిత్తూరు

మొరంపల్లి బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ప్రారంభం

చిత్తూరు జిల్లా ఐరాల మండలం మొరంపల్లి బీసీ కాలనీలో చిన్నారి విద్యార్థుల కోసం నూతన ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. గత 15 సంవత్సరాలుగా రెండు కిలోమీటర్లు నడిచి పక్క గ్రామానికి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి తొలగి, ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు విద్యార్థులకు స్వగ్రామంలోనే సురక్షిత, సౌకర్యవంతమైన విద్యా సదుపాయం లభించ

మొరంపల్లి బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ప్రారంభం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలం, మొరంపల్లి బీసీ కాలనీలో చిన్నారి విద్యార్థుల సౌకర్యార్థం నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కలిసి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మొరంపల్లి బీసీ కాలనీలో నివసిస్తున్న 21 మంది చిన్నారి విద్యార్థులు ఇప్పటివరకు బడికి వెళ్లాలంటే సుమారు రెండు కిలోమీటర్లు నడిచి పక్క గ్రామంలోని పాఠశాలకు వెళ్లాల్సి వచ్చేది. గత 15 సంవత్సరాలుగా మొరంపల్లి నుండి ఇతర గ్రామానికి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →