రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్
ఉద్యోగ్ నగరి ఎక్స్‌ప్రెస్‌లో సమోసా పిండిపై ఎలుక తిరుగుతూ, తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్‌లో పరిశుభ్రత, ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రైళ్లలో అందించే ఆహారం నాణ్యతపై ఇప్పటికే విమర్శలు ఉన్న నేపథ్యంలో, ప్రయాణికుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే ఇలాంటి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగ్ నగరి ఎక్స్‌ప్రెస్‌లో సమోసా పిండిపై ఎలుక స్వైరవిహారం వీడియో వైరల్ ఇండియన్ రైల్వేస్ రైళ్లలో అందించే ఆహార పదార్థాల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉద్యోగ్ నగరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే సమోసాల తయారీకి సిద్ధం చేసి ఉంచిన పిండిపై ఎలుక తిరుగుతూ, తింటున్న దృశ్యం సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది.
రైల్లోని క్యాటరింగ్ సర్వీసు వంటశాలలో చిత్రీకరించినట్లు కనిపిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీసింది. వైరల్ వీడియోలో సమోసాల కోసం సిద్ధం చేసిన పిండిని ఓ పెద్ద పాత్రలో ఉంచి ఉండగా, ఆ పిండిమీద ఎలుక స్వేచ్ఛగా తిరుగుతూ, కొరుకుతూ కనిపిస్తోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి