రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ముద్దనూరు పట్టణంలో శాంతిభద్రతల బలోపేతం, నేరాల నియంత్రణ కోసం ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాల్లో సుమారు 10 లక్షల రూపాయల విలువైన అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ నగేష్ బాబు తెలిపారు. ప్రజలు, వ్యాపారస్తుల ఆర్థిక సహకారంతో అమలు చేస్తున్న ఈ నిఘా వ్యవస్థ వల్ల చట్టవ్యతిరేక కార్యకలాపాలు తగ్గి పట్టణం మరింత సురక్షితంగా మారుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
ముద్దనూరులో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు ముద్దనూరు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణను లక్ష్యంగా పెట్టుకుని అత్యాధునిక నిఘా నేత్ర సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముద్దనూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నగేష్ బాబు తెలిపారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఐ నగేష్ బాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. పట్టణ ప్రజలు, స్థానిక వ్యాపారస్తుల ఆర్థిక సహకారంతో సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే అత్యాధునిక సీసీ కెమెరాలను ముద్దనూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి