రాయలసీమ న్యూస్ - నంద్యాల

నంద్యాల జిల్లా డోన్‌లో గ్యాంగ్ వార్ కలకలం

నంద్యాల జిల్లా డోన్‌లోని TR నగర్‌లో రెండు వర్గాల యువకుల మధ్య ఆధిపత్య పోరుతో గ్యాంగ్ వార్ చోటుచేసుకుని బండలు, రాళ్లతో పరస్పర దాడులు జరగడంతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నంద్యాల జిల్లా డోన్‌లో గ్యాంగ్ వార్ కలకలం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని TR నగర్‌లో రెండు వర్గాల యువకుల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఆధిపత్యం కోసం నడిరోడ్డుపై బాహాబాహీకి దిగిన ఇరు గ్రూపులు బండలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

స్థానికుల కథనం ప్రకారం ఎరుకలి పవన్, వడ్డే పవన్, బాబ్లూ, రాజు వర్గాల మధ్య గత కొంతకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ విభేదాలు శనివారం రాత్రి తీవ్ర స్థాయికి చేరుకుని, TR నగర్ ప్రధాన రహదారిపై రెండు వర్గాలు ఎదురెదురుగా నిలబడి విచక్షణ రహితంగా దాడులకు పాల్పడినట్లు సమాచారం.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →