రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్

ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమోషన్ కేసు: నిధి అగర్వాల్‌పై ఈడీ విచారణ ముగింపు

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌ను ఈడీ హైదరాబాద్ కార్యాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు విచారించింది. ‘జీత్ విన్’ సహా వివాదాస్పద యాప్‌లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన ఒప్పందాలు, పారితోషికం, నిధుల బదిలీపై వివరాలు కోరగా, విచారణ అనంతరం నిధి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమోషన్ కేసు: నిధి అగర్వాల్‌పై ఈడీ విచారణ ముగింపు టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఊహించని షాక్ తగిలింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రమోషన్ల వ్యవహారంలో భాగంగా ఆమెను ఈడీ అధికారులు విచారించారు.

హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ విచారణ దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగింది. ప్రముఖ బెట్టింగ్ యాప్ ‘జీత్ విన్’ (JeetWin) సహా పలు వివాదాస్పద ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ సంస్థలకు నిధి అగర్వాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన అంశంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →