రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

రాయచోటిలో రెండు తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభం

రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెండు నూతన తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల గర్భిణీలను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడం, ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇంటికి చేర్చడం లక్ష్యంగా ఈ సేవలను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది.

పేద, వెనుకబడిన వర్గాల గర్భిణీలకు అత్యవసర సమయంలో వేగంగా వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. రాయచోటి లో రెండు తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెండు నూతన తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా గర్భిణీ స్త్రీలను గ్రామీణ ప్రాంతాల నుంచి సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడంతో పాటు, ప్రసవానంతరం తల్లీబిడ్డలను తిరిగి ఇంటికి చేర్చే సేవలను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోందని మంత్రి వివరించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →