రాయలసీమ న్యూస్ - అనంతపురం
అనంతపురం జిల్లా పామిడి మండలం నిట్టూరు సరస్వతి విద్యామందిరం ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన దిలీప్ కుమార్, రీతిక్, శ్రీముఖి పరుగు పందెంలో 200, 400 మీటర్ల విభాగాల్లో జిల్లా, రాయలసీమ జోన్ స్థాయిల్లో వరుసగా ప్రథమ స్థానాలు సాధించి పాఠశాల ప్రతిష్ఠను పెంచారు. వారి విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల యాజమాన్యం సన్మానం చేయగా, గ్రామీణ ప్రాంత పాఠశాల విద్యార్థుల ఈ ప్రతిభ ఇతర విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందని
క్రీడల్లో మెరిసిన నిట్టూరు సరస్వతి విద్యామందిరం విద్యార్థులు అనంతపురం జిల్లా పామిడి మండలం నిట్టూరు నిలయం లోని సరస్వతి విద్యామందిరం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు పరుగు పందెంలో జిల్లా, రాయలసీమ జోన్ స్థాయిల్లో వరుసగా ప్రథమ స్థానాలు సాధించి పాఠశాల పేరు ప్రతిష్ఠలను పెంచారు.
సరస్వతి విద్యామందిరం విద్యార్థులు దిలీప్ కుమార్, రీతిక్, శ్రీముఖి సరస్వతీ విద్యాపీఠం ప్రతి సంవత్సరం నిర్వహించే ఖేల్‌కుద్ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. వీరు పరుగు పందెంలో 200 మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో పోటీ పడి జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి