రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. మోదీపై అభ్యంతరకర పోస్టులు..

మెటా ఇండియా హెడ్‌పై కేసు ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. మెటా ఇండియా అధిపతి అరుణ్‌ శ్రీనివాస్‌తో పాటు పలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలపై ఈ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రౌజ్‌ చేస్తుండగా ప్రధాని మోదీ సంబంధిత కొన్ని మార్ఫింగ్‌ చేసిన, డిజిటల్‌గా మార్పులు చేసిన వీడియోలు, చిత్రాలు కనిపించాయని ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిలో అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు ఉండటం సహా ప్రజలను తప్పుదోవ పట్టించేలా కంటెంట్‌ను రూపొందించి ప్రచారం చేశారని ఫిర్యాదుదారులు ఆరోపించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →