రాయలసీమ న్యూస్ బిజినెస్ డెస్క్
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కిలోకు ₹50–₹70కి చేరడంతో వినియోగదారుల భారం తగ్గించేందుకు కేంద్రం బఫర్ స్టాక్‌లోని ఉల్లిని మార్కెట్‌కు విడుదల చేయాలని నిర్ణయించింది. నాసిక్ నుంచి ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గువాహటి తదితర నగరాలకు కందా ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా పెద్ద ఎత్తున ఉల్లిని తరలించి సరఫరా పెంచితే, ముఖ్య నగరాల్లో ధరలు కొంత మేర స్థిరపడతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఉల్లి ధరల అదుపుకు కేంద్రం కందా ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్‌లో ఉన్న ఉల్లిని మార్కెట్‌కు విడుదల చేయాలని నిర్ణయించింది. ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సరఫరా పెంచి, వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతోంది.
ఈ క్రమంలో నాసిక్ నుంచి ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గువాహటి తదితర నగరాలకు కందా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నేటి నుంచి నడపనున్నారు. ఈ రైళ్ల ద్వారా పెద్ద ఎత్తున ఉల్లిని తరలించి, ఆయా ప్రాంతాల్లో తక్కువ ధరలకు వినియోగదారులకు అందుబాటులో ఉంచేలా కేంద్రం ప్రణాళికలు రూపొందించింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి