రాయలసీమ న్యూస్ - అనంతపురం

పెద్దారెడ్డిని కేసులో ఇరికించేందుకు మార్ఫింగ్ ఫోటోలు ఆరోపణ

తాడిపత్రి గోవా లిక్కర్ కేసు నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేరును కేసులోకి లాగేందుకు మార్ఫింగ్ ఫోటోలు వినియోగించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. @JaiTDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఈ ఫోటోలు తయారు చేసి ప్రచారం చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తగా, ఒరిజినల్ ఫోటోను బయటపెట్టి టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

పెద్దారెడ్డిని కేసులో ఇరికించేందుకు మార్ఫింగ్ ఫోటోలు ఆరోపణ తాడిపత్రి పట్టణంలో గోవా లిక్కర్ కేసు నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేరును రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మార్ఫింగ్ ఫోటోలు వినియోగించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రెండు రోజుల క్రితం తాడిపత్రిలో పోలీసులు సుమారు 400 బాటిళ్ల గోవా లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పుట్లూరు మండలం చింతలపల్లికి చెందిన రామాంజినేయరెడ్డి అనుమానితుడిగా ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →