రాయలసీమ న్యూస్ - అనంతపురం
డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు ఇచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు తాడిపత్రి నిరసనకు వెళ్తుండగా ముచ్చుకోట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి అనంతపురం తరలించగా, ఈ చర్యలు ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన
ముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్ డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపు మేరకు పార్టీ నేతలు జిల్లాల వారీగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో తాడిపత్రిలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఇతర వైసీపీ నేతలను ముచ్చుకోట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రి వైపు ప్రయాణిస్తున్న వారి వాహనాలను అక్కడే నిలిపివేసి ముందుకు వెళ్లనీయకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి