రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పర్యావరణం, ప్రజారోగ్య రక్షణ కోసం ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి, గుడ్డ సంచులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచిస్తూ, ఆగస్టు 15 నాటికి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్య సాధనకు సామూహిక కృషి, ప్రజల సహకారం కీలకమని ఆయన పేర్కొన్న
ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరును పరిశుభ్రమైన, ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు పురపాలక సంఘం, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రజలకు సందేశం ఇచ్చారు.
అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ నుంచి శివాలయం సెంటర్ వరకు నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం, ప్రజారోగ్యంపై కలిగే దుష్పరిణామాలను ఎమ్మెల్యే వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల నేల, నీరు, గాలి కాలుష్యం పెరిగి, దీర్ఘకాలంలో ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆయన సూచించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి