రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్
మలయాళ సైన్స్ ఫిక్షన్ కామెడీ అడ్వెంచర్ చిత్రం ‘ప్లూటో’లో సూపర్ పవర్స్ లేని ఏలియన్ మద్యం తాగుడుకు బానిసయ్యే వినూత్న కథను చూపించారు. జూలై 30న థియేటర్లలో విడుదలై IMDbలో 6.7 రేటింగ్ సాధించిన ఈ సినిమా, ఆగస్టు 24 నుంచి Saina Playలో మలయాళంతో పాటు తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
కుటుంబంతో కలిసి సరదాగా చూడదగిన భిన్నమైన సైన్స్ ఫిక్షన్‌గా సినీ వర్గాలు ఈ చిత్రాన్ని సూచిస్తున్నాయి. తాగుడుకు బానిస అయ్యే ఏలియన్ కథతో ‘ప్లూటో’ ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే సాధారణంగా గుర్తొచ్చేది అద్భుత శక్తులు కలిగిన గ్రహాంతరవాసులు, భారీ విజువల్ ఎఫెక్ట్స్, భూమిపైకి వచ్చే ఏలియన్లు, వాటి చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ సన్నివేశాలు.
అయితే మలయాళ చిత్రం ‘ప్లూటో’ ఈ సాంప్రదాయ ఫార్ములాకు పూర్తిగా భిన్నంగా రూపుదిద్దుకుంది. సూపర్ పవర్స్ లేని ఓ ఏలియన్ భూమిపైకి వచ్చాక మద్యం తాగుడుకు బానిసైతే ఎలా ఉంటుందనే వినూత్న కాన్సెప్ట్‌ను కామెడీ, అడ్వెంచర్, ఎమోషన్‌లతో కలిపి తెరపైకి తీసుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లను దాటి ఓటీటీలోకి చేరింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి