రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన సుమారు 23 వేల ఇళ్లలో అనేక నిర్మాణాలు ఆర్థిక ఇబ్బందుల వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయాయి. లబ్ధిదారుల సమస్యలపై తక్షణ చర్య తీసుకుని, అవసరమైన నిధులు, సాంకేతిక సహకారం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించాలని BJP నగరం-1 అధ్యక్షుడు వంకదార నరేంద్రరావు పురపాలక అధికారులను కోరారు.
పేదల సొంతింటి కలలు అర్ధాంతరంలోనే ‘కూడు, గుడ్డ, గూడు’ సగటు మానవుడి కనీస అవసరంగా భావిస్తారు. ఎంతటి కష్టమొచ్చినా, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడినా చివరికి తలదాచుకునే సొంత ఇల్లు ఉంటే చాలు అనుకునే నిరుపేద కుటుంబాలు మరెన్నో.
అటువంటి వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఈ పథకం కింద దాదాపు 23 వేల మంది పేద కుటుంబాలకు ఇళ్లు మంజూరయ్యాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి