రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా వేంపల్లి పట్టణంలో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ బీట్ నిర్వహించి ప్రత్యేక నిఘా చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం, శాంతిభద్రతలను భంగం కలిగించే చర్యలను ముందస్తుగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
ప్రజలు అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వేంపల్లి పట్టణంలో డ్రోన్ బీట్ నిర్వహించిన పోలీసులు కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ బీట్ నిర్వహించారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ నిఘా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సీఐ నరసింహులు ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్, క్రిస్టియన్ కాలనీ, కడప రోడ్డు, రెడ్డయ్య కాలనీ పరిసరాల్లో డ్రోన్ ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి