రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్

సందీప్ రెడ్డి వంగ చిత్రంలో దీపికా పదుకొనే ఎంపికపై నిర్మాత ప్రణయ్ వెల్లడి

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొనేపై మొదటగా ఆలోచించి, ఏడాదిన్నర పాటు కథ, పాత్రలపై చర్చలు జరిపినట్లు నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తెలిపారు. వరుస బ్లాక్‌బస్టర్‌ల తర్వాత దీపికా నెట్ ఇన్‌కమ్‌లో 10 శాతం లాభం, డేట్స్, కాల్షీట్‌లపై కఠిన షరతులు పెట్టడంతో పాటు, చిత్ర ప్రణాళికలకు సంబంధించిన కీలక సమాచారం బయటకు లీక్ అయ్యిందనే అనుమానం రావడంతో ఆమెను ప్రాజెక్టు నుంచి తప్పించుకున్నా

సందీప్ రెడ్డి వంగ చిత్రంలో దీపికా పదుకొనే ఎంపికపై నిర్మాత ప్రణయ్ వెల్లడి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న చిత్రాల నిర్మాణ ప్రక్రియలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర అంశాన్ని ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ వెలుగులోకి తీసుకొచ్చారు. ఎన్టీవీ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణయ్, గతంలో హీరోయిన్ ఎంపిక దశలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనేతో జరిగిన చర్చలను వివరించారు.

ప్రణయ్ రెడ్డి వంగ తెలిపిన వివరాల ప్రకారం, ఆ సినిమా గురించి మొదటగా ఆలోచించిన సమయంలో సందీప్ రెడ్డి వంగ మనసులో హీరోయిన్‌గా దీపికా పదుకొనేనే ఉన్నారు. ఆమె నటన, ప్రతిభపై ఉన్న నమ్మకంతోనే ఆమెను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →