రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మార్కెట్ ప్రాంతంలో స్వయంగా ప్రచారం నిర్వహించి, వ్యాపారుల వద్ద ఉన్న నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను స్వాధీనం చేయించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల స్థానంలో బట్ట, కాగితం సంచులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచిస్తూ, నిషేధిత ప్లాస్టిక్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని మున్సిపల్ వర్గాలు స్
ప్రొద్దుటూరు లో ప్లాస్టిక్ నిషేధంపై కమిషనర్ ప్రచారం ప్రొద్దుటూరు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రచారం నిర్వహించారు. మార్కెట్ ప్రాంతంలో వ్యాపారులు, వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు మున్సిపల్ చెత్త సేకరణ ట్రాక్టర్‌పైకి ఎక్కి స్వయంగా ప్రచార కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు.
మార్కెట్‌లోని వివిధ వ్యాపార సంస్థలను సందర్శించిన కమిషనర్, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై వ్యాపారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను ఇకపై ఉపయోగించకూడదని, ఇప్పటికే వినియోగంలో ఉన్న వాటిని తక్షణమే తొలగించాలని వ్యాపారులను ఆదేశించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి