రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని పడమటి కోన గ్రామం బోరెడ్డిగారి పల్లెలో తన స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి, రహదారులు, తాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాల అమలు వంటి సమస్యలపై ప్రజల వినతులు స్వీకరించారు. ప్రతి వినతిని ఓర్పుగా విని సంబంధిత అధికారులను అక్కడికక్కడే ఆదేశిస్తూ, ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కారం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ అన్నమయ్య జిల్లా రాయచోటి లో ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. చిన్నమండెం మండలం, పడమటి కోన గ్రామం బోరెడ్డిగారి పల్లెలోని తన స్వగృహంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎదురవుతున్న మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రజలు తమ వినతులను సమర్పించినట్లు స్థానిక సమాచారం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి