రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం సాకిబండ గ్రామంలో చెరువు అభివృద్ధి పనులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరితమ్మ శ్రీకారం చుట్టారు. చెరువు పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్య పెంపు, కాలువల సదృఢీకరణ ద్వారా సాగునీటి సౌకర్యం మెరుగుపడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని నాయకులు పేర్కొన్నారు.
గ్రామీణ నీటి వనరుల అభివృద్ధి, రైతు సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వారు వివరించారు. రాయచోటి సాకిబండ చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మండిపల్లి హరితమ్మ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం సాకిబండ గ్రామంలో చెరువు అభివృద్ధి పనులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరితమ్మ గురువారం శ్రీకారం చుట్టారు.
గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమానికి దోహదపడే ఈ పనులను అధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు. సాకిబండ గ్రామ పరిధిలో ఉన్న చెరువును అభివృద్ధి చేసి సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచే లక్ష్యంతో ఈ పనులను ప్రభుత్వం చేపట్టింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి