రాయలసీమ న్యూస్ బిజినెస్ డెస్క్
RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యలతో UPI లావాదేవీలపై ఛార్జీల అంశం మరోసారి చర్చకు వచ్చింది. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను దీర్ఘకాలం కొనసాగించాలంటే సాంకేతిక మౌలిక వసతుల ఖర్చును ఎవరో భరించాల్సిందేనని ఆయన సూచించగా, రెండు వేల రూపాయలకుపైగా ఉన్న వ్యాపార UPI లావాదేవీలపై MDR విధించే అవకాశంపై ఆర్థిక, బ్యాంకింగ్ వర్గాలు పరిశీలిస్తున్నాయి.
UPI లావాదేవీలపై ఛార్జీల ఆలోచనపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న UPI సేవలపై ఛార్జీలు విధించే అంశం మరోసారి చర్చకు వచ్చింది. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను దీర్ఘకాలం కొనసాగించాలంటే, దానికి అయ్యే ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు.
ప్రస్తుతం UPI సేవలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, భవిష్యత్‌లో ఈ వ్యవస్థ ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటుందన్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. డిజిటల్ పేమెంట్స్ విస్తరణతో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు భారీ స్థాయిలో సాంకేతిక మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి