రాయలసీమ న్యూస్ - తిరుపతి
రేణిగుంటలో ఆగష్టు 17 నుంచి 19 వరకు జరగనున్న గంగ జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ విస్తృత భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు చేసింది. జాతర రోజుల్లో రహదారుల ఆక్రమణ, పార్కింగ్, అత్యవసర సేవల వాహనాల రాకపోకలపై ప్రత్యేక సూచనలు జారీ చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, ప్రజలు, వ్యాపారులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని సీఐ ఎస్.
రేణిగుంటలో గంగ జాతరకు పోలీసుల పటిష్ట ఏర్పాట్లు రేణిగుంట పట్టణంలో ఆగష్టు 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న గంగ జాతరను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో వ్యాపారులు, దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. జయచంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జాతర సమయంలో పాటించాల్సిన నిబంధనలను, జాగ్రత్తలను వ్యాపారులకు వివరించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి