రాయలసీమ న్యూస్ - తిరుపతి

రేణిగుంటలో ఎస్‌ఐఆర్‌ అభ్యంతరాల విచారణ సజావుగా

రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో నో మ్యాపింగ్‌ డిస్క్రెపెన్సీలు, ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలపై వినతులు, అభ్యంతరాల విచారణను అధికారులు సజావుగా నిర్వహించారు. ఓటర్ల నుంచి వచ్చిన ఆధార పత్రాలు, ఛాయాచిత్రాలను సవివరంగా పరిశీలించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు ఆర్డీవో భాను ప్రకాష్‌రెడ్డి తెలిపారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఓటర్ల జాబితా మరింత శుద్ధి చెంది, ఖచ్చితమైన వివరాలతో సిద్ధం కానుందని అధికారులు పేర్కొన్నారు. రేణిగుంటలో ఎస్‌ఐఆర్‌ అభ్యంతరాల విచారణ సజావుగా రేణిగుంట : ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా నో మ్యాపింగ్‌ డిస్క్రెపెన్సీలపై వినతులు, అభ్యంతరాల విచారణ కార్యక్రమాన్ని మంగళవారం రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక సమగ్ర సవరణ పరిశీలకులు, కార్మికశాఖ కమిషనర్‌ గంధం చంద్రుడు, ఆర్డీవో భాను ప్రకాష్‌రెడ్డి హాజరయ్యారు. విచారణ సందర్భంగా పోలింగ్‌ బూత్‌ల వద్ద జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →