రాయలసీమ న్యూస్ - తిరుపతి

రేణిగుంటలో వెయ్యి మొక్కల నాటడం ప్రారంభం

రేణిగుంట మండలంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో వెయ్యి మొక్కల నాటే హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, నాటిన మొక్కలను సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

రేణిగుంటలో వెయ్యి మొక్కల నాటడం ప్రారంభం రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడాన్ని లక్ష్యంగా చేసుకుని రేణిగుంట మండల పరిధిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో వెయ్యి మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటి వాటికి నీరు పోశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →