రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

సంబేపల్లి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్లలో ఈశ్వరయ్య హత్య కేసులో రాయచోటి రాయుడు కాలనీకి చెందిన సింహాద్రి, ఫరూక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీరు బాటిల్స్ గాజు ముక్కలు, బండరాయితో దాడి చేసి ఈశ్వరయ్యను హత్య చేసినట్లు డిఎస్పీ కృష్ణ మోహన్ తెలిపారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో గస్తీని పెంచారు. సంబేపల్లి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్లలో జరిగిన ఈశ్వరయ్య దారుణ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా రాయచోటి డిఎస్పీ కృష్ణ మోహన్ తెలిపారు.

ఆగస్టు 7న ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సంబేపల్లి మండలం రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య (50)ను మద్యం మత్తులో బీరు బాటిల్స్ గాజు ముక్కలతో పొడిచి, బండరాయితో కొట్టి హత్య చేసినట్లు డిఎస్పీ వివరించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →