రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరు అర్బన్ సచివాలయ ఉద్యోగుల సమస్యపై స్పందించిన కమిషనర్

ప్రొద్దటూరు అర్బన్ సచివాలయ ఉద్యోగుల సెన్సస్ రెమ్యునరేషన్ జమ ఆలస్యంపై ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే టీపీఓ అధికారులను సంప్రదించి చర్యలు ప్రారంభించారు. సంబంధిత మొత్తం ఇప్పటికే ఇండియన్ బ్యాంకులో జమైందని, సోమవారం సాయంత్రం లోపు ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి క్రెడిట్ అవుతుందని అధికారులు హామీ ఇవ్వగా, కమిషనర్ తక్షణ స్పందనపై అసోసియేషన్ నాయకులు కృ

ప్రొద్దుటూరు అర్బన్ సచివాలయ ఉద్యోగుల సమస్యపై స్పందించిన కమిషనర్ ప్రొద్దటూరు: సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సెన్సస్ రెమ్యునరేషన్‌ను వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా తక్షణ చర్యలు తీసుకున్న ప్రొద్దటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్‌కు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రొద్దటూరు తాలూకా అధ్యక్షులు జి. రామసుబ్బయ్య యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన సెన్సస్ రెమ్యునరేషన్ చుట్టుపక్కల ఉన్న రూరల్, అర్బన్ ప్రాంతాల ఉద్యోగుల ఖాతాల్లో ఇప్పటికే జమ అయినప్పటికీ, ప్రొద్దటూరు అర్బన్ సచివాలయ ఉద్యోగుల ఖాతాల్లో మాత్రం ఇంకా జమ కాలేదని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు జి. రామసుబ్బయ్య యాదవ్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ దృష్టికి తీసుకెళ్లారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →