రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లాలో గత ప్రభుత్వ కాలంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ రుణాల్లో భారీ అక్రమాలు జరిగాయని అసెంబ్లీలో జీరో అవర్‌లో ప్రస్తావించారు. NCDC పథకం కింద రికార్డుల్లో ఒక్కొక్కరికి రూ.2.80 లక్షలు చూపించి, వాస్తవానికి కేవలం రూ.30 వేలే ఇచ్చి, ఇప్పుడు వడ్డీతో రూ.1.02 లక్షలు వసూలు చేస్తున్నారని, ఎంపికలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకో
గొర్రెల పంపిణీ రుణాల్లో అక్రమాలు: అసెంబ్లీలో మైదుకూరు ఎమ్మెల్యే ప్రస్తావన కడప : గత ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన రుణాల వ్యవహారంపై మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఈరోజు శాసనసభలో జీరో అవర్‌లో అంశాన్ని లేవనెత్తారు. పథకం అమలులో జరిగిన అక్రమాలు, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సభ దృష్టిని ఆకర్షించారు.
కడప జిల్లాలో సుమారు 75 ప్రాథమిక గొర్రెల పంపిణీ సంఘాలు ఉన్నాయని, వాటి పరిధిలో దాదాపు 600 మంది సభ్యులు ఉన్నారని ఎమ్మెల్యే వివరించారు. ఈ సంఘాల ద్వారా గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేసిన విధానంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి