రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

సిద్దవటం ఊరుసు గంధ మహోత్సవానికి కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

సిద్దవటం ఎగువపేటలోని ఫత్తుమియా మస్జీద్ వద్ద ఆదివారం జరగనున్న ఊరుసు గంధ మహోత్సవం కోసం ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి, రాత్రి పహారా, ట్రాఫిక్ నియంత్రణతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

సిద్దవటం ఊరుసు గంధ మహోత్సవానికి కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు సిద్దవటం: ఊరుసు మహోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మండలకేంద్రమైన సిద్దవటం ఎగువపేటలోని ఫత్తుమియా మస్జీద్ వద్ద ఆదివారం జరగనున్న గంధ మహోత్సవ ఏర్పాట్లను ఆయన శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సచ్చికేత్ విశ్వనాధ్ ఆదేశాల మేరకు, రాజంపేట ఇంచార్జి డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట సర్కిల్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మొత్తం 30 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →