రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కారణంగా మున్సిపల్, వార్డు సచివాలయ సిబ్బందికి మంజూరు చేసిన సెలవులను కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ రద్దు చేశారు. ఓటర్ల జాబితా సవరణలో నిర్లక్ష్యం, విధుల్లో అలసత్వం చూపిన బూత్ లెవెల్ ఆఫీసర్స్ పై సేవా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ఎస్‌ఐఆర్ పనులకు పూర్తి సమయం కేటాయించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఎస్‌ఐఆర్ విధుల్లో నిర్లక్ష్యం వద్దు: మున్సిపల్ సిబ్బందికి సెలవులు రద్దు ప్రొద్దటూరు:- ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా (ఎస్‌ఐఆర్) ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్, వార్డు సచివాలయ సిబ్బందికి మంజూరు చేసిన సెలవులను రద్దు చేసినట్లు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ పనులు సమయానికి, నిరంతరాయంగా పూర్తయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ
ఎస్‌ఐఆర్ విధుల్లో భాగంగా పనిచేస్తున్న కొందరు బూత్ లెవెల్ ఆఫీసర్స్ (బీఎల్‌ఓలు) తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని, విధి సమయంలో ఫోన్‌లో అందుబాటులో ఉండటం లేదని ఎన్నికల సంబంధిత అధికారులకు ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఓటర్ల జాబితా సవరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి