రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి జిల్లా దివ్యాంగుల సేవా సమితి వ్యవస్థాపకుడు మురళీ గౌడ్, సిట్టింగ్ క్రికెట్ తదితర దివ్యాంగుల క్రీడా పోటీల కోసం 30 స్పోర్ట్స్ వీల్‌చైర్లు అందించాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమవుతున్న దివ్యాంగ క్రీడాకారులకు ప్రత్యేక వీల్‌చైర్లు అత్యవసరమని, తిరుపతిని దివ్యాంగుల క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సమితి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
సిట్టింగ్ క్రికెట్ పోటీలకు 30 స్పోర్ట్స్ వీల్‌చైర్లు ఇవ్వాలంటూ వినతి తిరుపతి : త్వరలో జరగనున్న సిట్టింగ్ క్రికెట్ తదితర క్రీడా పోటీల్లో దివ్యాంగులు మెరుగైన ప్రతిభ కనబరచేందుకు 30 స్పోర్ట్స్ వీల్‌చైర్లు అందజేయాలని తిరుపతి జిల్లా దివ్యాంగుల సేవా సమితి వ్యవస్థాపకులు మురళీ గౌడ్ అధికారులను కోరారు. ఈ మేరకు సోమవారం సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఇప్పటికే NLR, గుంటూరు, TPT జిల్లాల్లో సిట్టింగ్ క్రికెట్ పోటీలు నిర్వహించినట్లు మురళీ గౌడ్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న దివ్యాంగులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ, తగిన క్రీడా సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి